అన్నప్రాసన వేడుకకు హాజరైన సైదులు నాయక్..

Published: Friday April 22, 2022
కొణిజర్ల, ఏప్రిల్ 21 (ప్రజాపాలన న్యూస్): కొణిజర్ల మండల పరిధిలోని ఉప్పలచెలక గ్రామ మాజీ సర్పంచ్ జర్ప్లా దేవ్లా మనవడు అన్నప్రాసన వేడుక గురువారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదావత్ సైదులు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ కుటుంబ సభ్యులందరిని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుగులోతు బాబు, మంగీలాల్, జర్ప్లా రవి, రాంలాల్, తదితరులు పాల్గొన్నారు.