ప్రతి విద్యార్థి గురువు, తల్లిదండ్రులు చెప్పిన బాటలో నడవాలి: ఎన్నారై గోళ్ళ సైదులు

Published: Friday March 03, 2023

బోనకల్, మార్చి 02 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధి లోని గోవిందాపురం(ఎల్) గ్రామా వాస్తవ్యులు గోళ్ళ శ్రీనివాస్ రావు గోళ్ళ రాధమ్మ కుమారుడు ఎన్ ఆర్ ఐ సైదులు యాదవ్ గోళ్ళ అమెరికా కాలిఫోర్నియాలో గత 8 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ, ప్రస్తుతం తానే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని నడిపించే స్థాయిలో ఉన్నాడు.ఆయన గురువారం మార్చి 2వ తేదీన స్వదేశ ఆగమన సందర్బంగా భావ మెట్టెల నాగరాజు అక్క రేణుక మేనల్లుడు మోహిత్ కుమార్ యాదవ్,సినీ గేయ రచయిత కువ్వారపు నాగరాజు, స్నేహితులు తెనాలి దినేష్,రవి జాదవ్ కుటుంభం సభ్యులు,బంధువులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘాన స్వాగతం పలికారు. గొళ్ళ సైదులు కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్న తన తల్లిదండ్రులు తన విద్య పట్ల ఏమాత్రం వెనుకంజు వేయలేదని, చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు తెలిపారు. నిత్యం ఎంతో శ్రమించి చదువుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడుతూ ఉండేవాడు.తాను గురువారం ఈ స్థాయిలో ఉండడానికి తన తల్లిదండ్రులు సహకారం,అలాగే తనకి విద్య నేర్పిన గురువులు వారి చూపిన బాటలో నడవడమేనని సైదులు అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు గురువు చెప్పిన బాటలో నడుస్తూ ఇష్టపడి విద్యను అభ్యసిస్తే విజయం దానంతట అదే సొంతమవుతుందని ఈ సందర్భంగా సైదులు పలువురకు తెలియజేశారు.తమ గ్రామం నుండి సైదులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించే స్థాయిలో ఉండటంతో గ్రామం నుంచి కూడా అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.