విద్యుత్ సేవలు అందించడం అభినందనీయం ..లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎద్ధండి దివాకర్

Published: Saturday July 16, 2022
రాయికల్, జులై 15 (ప్రజాపాలన ప్రతినిధి): గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాల్లోను రాయికల్ పట్టణంలో విద్యుత్తు వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సేవలు అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎద్ధండి దివాకర్ అన్నారు.శుక్రవారం రాయికల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల్లో నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించిన విద్యుత్ ఉద్యోగులు బత్తిని లక్ష్మణ్,ఎనుగంటి నారాయణ,రానవేని రాజశేఖర్ లను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలనికోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి రంజీత్,కోశాధికారి కడకుంట్ల నరేష్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,ఎల్సీఐఎఫ్ దాసరిగంగాధర్,మాజీ జోన్ చైర్పర్సన్ మ్యాకల రమేష్,డిసీలు బత్తిని భూమయ్య,కాటిపెళ్లి రాంరెడ్డి,,క్లబ్ సభ్యులు చౌడారపు లక్ష్మీనారాయణ,వాసం స్వామి,వాసం ప్రసాద్,బొమ్మకంటి నవీన్,నాగభూషణం,ఆడెపు రామ్ ప్రసాద్,మురళి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area