శ్రీ డాక్టర్ గడల శ్రీనివాస రావు జన్మదినం సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

Published: Friday July 01, 2022
మధిర జూన్ 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మానవసేవే అంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ మరియు హెల్త్ డైరెక్టర్. గౌరవనీయులు శ్రీ డాక్టర్ గడల శ్రీనివాస రావు  జన్మదినం సందర్భంగా మతిస్థిమితం లేని వారికి అనాధలకు వృద్ధులకు వికలాంగులకు ఆర్కే ఫౌండేషన్  అనాధ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా వారి బాల్యమిత్రుడు రామచంద్ర రావు వారి సతీమణి మల్లీశ్వరి . అన్నదానం నిర్వహించగాముఖ్యఅతిథిగా ఆర్టీసీ డిఎం దేవదానం  హాజరై దగ్గరుండి అందరికీ భోజనం వడ్డించారు.ఈ సందర్భంగా జన్మదిన జరుపుకుంటున్న  శ్రీనివాస రావు కి శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆశ్రమంలోని వారందరూ దీవించారు.. ఈకార్యక్రమంలో మధిర డిపో మేనేజర్ దేవదానం. షేక్ నాగుల్ మీరా వారి సతీమణి రోజా. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్నాటి పద్మావతి. ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం చైర్మన్. దోర్నాల రామకృష్ణ డైరెక్టర్ జ్యోతి ఆర్ కె రామారావు సుదర్శన్ పాల్గొన్నారు.