దయచేసి వినండి మధిరలో రైళ్లు ఆపండి నేడే మధిరకిరానున్నడిఆర్ఎంప్రయాణికుల సమస్యలపై డిఆర్ఎంను

Published: Tuesday December 13, 2022
మధిర రూరల్ డిసెంబర్ 12 ప్రజా పాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం తర్వాత అతి పెద్దదైన మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని మధిర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఈ నెల ఈరోజువ తేదీన మధిర రైల్వే స్టేషన్ తనిఖీ చేసేందుకు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా రానన్నారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు డిఆర్ఎంను కలిసి మధిరలో రైళ్ళు నిలుపుదల గురించి వినతి పత్రాలు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలోని సమీప గ్రామాలకు మధిర రైలు నిలయం రవాణా వారధిగా ఉంది. మధిర రైల్వే స్టేషన్ నుండి సుమారు 100 గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతిరోజు మధిర రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు మధిర రైల్వే స్టేషన్ నుండి రైల్వే శాఖకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. మధిర రైల్వే స్టేషన్లో అనేక సంవత్సరాలుగా ఆగిన రైళ్ళను కోవిడ్ పేరుతో రద్దు చేసింది. కోవిడ్ తర్వాత పునరుద్దించిన రైళ్ళను ప్రస్తుతం మధిరలో హాల్టింగ్ ఇవ్వటం లేదు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు కోవిడ్ కంటే ముందు  మధిరలో హాల్టింగ్ ఉండేది. కోవిడ్ తర్వాత పునరుద్దించిన ఈ రైలును మధిరలో ఆపడం లేదు. అదే విధంగా లింక్ ఎక్స్ ప్రెస్ అప్ వైపు ఢిల్లీ వెళ్ళేది ఆగుతుండగా డౌన్ వైపు వైజాగ్ వెళ్ళేది ఆగటం లేదు. గతంలో మధిరలో ఉదయం 7-39 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ప్యాసింజర్ రైలు (నెంబర్ 67211) ఉండేది. ప్రస్తుతం ఈరైలు కూడా నడవక పోవడంతో మధిర పరిసర ప్రాంత ప్రజలు ఉదయం విజయవాడ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో మధిర రైల్వే స్టేషన్ లో హల్టింగ్ ఉన్న గౌతమి ఎక్స్ ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 12738, 12737) సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 12719, 12709) లను కూడా మధిరలో ప్రస్తుతం హల్టింగ్ లేదు. గతంలో మధిరలో ఆగిన లక్నో ఎక్స్ ప్రెస్ రైలు కూడా ప్రస్తుతం మధిర స్టేషన్లో అగటం లేదు.ఈ ట్రైన్ మధిర కంటే చిన్నదైనా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఆగటం విచిత్రం. ఇటీవల కాజీపేట నుంచి తిరుపతికి నూతనంగా వేసిన ట్రైన్ నెంబర్ 07091, 07092 కూడా మధిరలో హల్టింగ్ లేదు. ఈ రైలు కూడా మధిర కంటే తక్కువ ఆదాయం వస్తున్న కేసముద్రంలో ఆగుతుంది. మధిరలో ఎప్పటినుంచో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలును (నెంబర్ 12655,  12656) ఆపాలను ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నా ఇంతవరకు అతి గతి లేదు. ఇటీవల ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు మధిరలో నవజీవన్ రైలును ఆపాలని రైల్వే ఉన్నతాధికారులు కలిసి వినతిపత్రం అందజేశారు దీనికి రైల్వే అధికారులు కూడా త్వరలోనే నవజీవన్ రైలును మధిరలో ఆపుతామని హామీ ఇచ్చి రెండు నెలలైనా ఇంతవరకు అమలు కాలేదు. గతంలో పెద్దపల్లి నుంచి విజయవాడ వరకు   (రైలు నెం 77251) ఉన్న డెమో ప్యాసింజర్ రైలు కూడా రద్దు చేశారు. దీన్ని ఇంతవరకు పునరుద్ధరించలేదు. మధిర రైల్వే స్టేషన్లో ఎక్కువ రైళ్లను ఆపితే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండటమే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మధిర రైల్వేస్టేషన్లో రైళ్లను ఆపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులకు, స్థానిక నేతలకు ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైల్వే డివిజనల్ మేనేజర్ స్పందించి మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లును ఆపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.