సమస్య వలయంలో బస్తీలు : కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్

Published: Tuesday September 20, 2022
ప్రజా పాలన శేరిలింగంపల్లి /సెప్టెంబర్ 19 న్యూస్ :బస్తీలో అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకురావటం జరిగిందని, సమస్య వలయంలో బస్తీలు కొట్టుమిట్టడుతున్నాయని కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో నిర్వహించిన బిజెపి బస్తీ బాట కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి, కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ లు బస్తిలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునిటిలో మురుగు నీరు కలుస్తున్నాయని, వాటర్ బోర్డు అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు తమవ సమస్యలను వెల్లబోసుకున్నారని తెలిపారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై పారుతున్నాయని, వీధిదీపాలు సరిగా లేవని బస్తిలో ప్రైవేట్ హాస్టల్ భవనాల ముందు వాహనాలు అడ్డుగా ఆగడంతో పారిశుధ్య కార్మికులు రోడ్డు శుభ్రం చేయకాపోగ చెత్త తీయడంలేదని బస్తిలో నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. బస్తిలో పర్యటించి సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. గతంలో గుట్టల బేగంపేట్ లో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు హెచ్చరించారు. బస్తిలలో మద్యం దుఃఖనాలు కూడా సమయపాలన లేకుండా అమ్ముతున్నారని, పనిచేసుకుని బతికే వారు మద్యం మత్తులో పడి వారి ఉపాధి కోల్పోతున్నారని మండిపడ్డారు. డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాన్యంకొండ సాగర్, కే. పద్మ, కే. రేణుక, కే. మల్లేశ్వరి, నాగుభాయ్, జి. నర్సింహా, వెంకటేష్, రవి నాయక్, సురేష్ సాగర్, చెన్నయ్య సాగర్, సాయి, ఖాజా, రాము, సరోజ రెడ్డీ, కిషన్ జీ, విష్ణువర్ధన్ రెడ్డీ, రేఖ, సంతోష్ గుప్తా, బల్లు యాదవ్, వెంకట్ రమణ, రెడ్డమ్మ, చిన్న, పృద్వి, మధు, గోపాల్ గౌడ్ బస్తి ప్రజలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area