పొలం గట్టు మీదనుంచి వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డితో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమ

Published: Friday May 21, 2021
మధిర, మే 20, ప్రజా పాలన ప్రజలకు : కొన్ని రోజుల తరబడి వడ్లు కొనకుండా, మిల్లులు ఎలాట్ కాకుండా, లారీలు రాకుండా గత కొన్ని రోజులుగా పొలంలో తడుస్తున్న ధాన్యం గురించి వ్యవసాయ శాఖామంత్రికి చెప్పి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన అలాగే తరుగు కూడా 6కిలోల నుంచి 8 కిలోల వరకూ తీస్తున్నారు. అంత మొత్తంలో తరగు తీయకుండా చూడాలని మంత్రికి చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కగత కొన్ని రోజులుగా ఎర్రుపాళెం, మధిర, చింతకాని, బోనకల్, ముదిగొండ తదితర మండలాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి, సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చి, చర్యలు తీసుకోవాలని కోరిన సీఎల్పీ నేత ఈ విషయంపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. జిల్లా అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని సీఎల్పీనేతకు ఆ మేరకు హామీ ఇచ్చారు