అరుంధతి అస్పత్రిలో జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు

Published: Thursday January 12, 2023
 మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడిపల్లి, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి)
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో  అరుంధతి ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అరుంధతి  ఆస్పత్రి కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం  మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 70 మంది జర్నలిస్టులకు గుండె, లివర్, కిడ్నీలకు సంబంధించి 2డి ఈకొ, ఈసిజి, ఆల్ట్రా స్కానింగ్ లతో పాటు 20 రకాల పరీక్షలు చేశారు. అనంతరం సంబంధిత వైద్యులు పరీక్షించి తగిన సూచనలు చేశారు. అనంతరం  మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో తమ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు. తమ వైద్య సిబ్బంది విలేకరులకు సేవలందించేందుకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. సామాన్య ప్రజానీకానికి కూడా  ఉచిత వైద్య సదుపాయాల కోసం తెలియజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు,జిల్లా యూనియన్ కార్యదర్శి వెంకట్రాంరెడ్డి లు మాట్లాడుతూ విలేకరుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న మరి రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి అరుంధతి ఆసుపత్రిలో వైద్య సేవలను పొందుతామని తెలిపారు. మెగా వైద్య శిబిరంలో జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి అందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలనికోరారు. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు, జర్నలిస్టు కుటుంబ సభ్యులు  వినియోగించుకున్నారని ఈ సందర్భంగాతెలిపారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు కృష్ణ, రామకృష్ణ, రచ్చ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మురళి, ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులు కోటగడ్డ శ్రీనివాస్, హరినాథ్, బాలాజీ,  సాయిబాబా, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, నాగేంద్ర చారి, శ్రీధర్ ,  ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి , కోశాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.