పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ లోని ఐఓసీ కార్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానం అవ

Published: Wednesday December 01, 2021
హైదరాబాద్ 30 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ మెదక్ రీజియన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆద్వర్యంలో గజ్వెల్ లోని ఐఓసీ కార్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సు‌. క్షేత్ర స్థాయిలో  పనిచేసే ఇంజనీర్లు మరియు సాంకేతిక సిబ్బందికి నాణ్యత నియంత్రణ పైన డిసెంబర్ 1వ తేదీన మెదక్ రీజియన్ పరిధిలో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కనకరత్నం ప్రకటించారు.  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టే వివిధ పనుల్లో నాణ్యత నియంత్రణ మరియు పర్యవేక్షణ విషయంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఇంజనీర్లు మరియు సాంకేతిక సిబ్బందికి అవగాహన కల్పించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని మెమో సంఖ్య: ఏఇఇ 1/క్వాలిటీ కంట్రోల్ వర్క్ షాప్/2021-22 తేదీ:25-11-2021 ద్వారా మెదక్ రీజియన్ సూపరింటెండింగ్ ఇంజనీర్  ప్రకటించారు.
ఈ క్రింది అంశాలపై  అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
-రోడ్లు మరియు భవనాల నిర్మాణంలో నాణ్యత తనిఖీ మరియు జాగ్రత్తలు.
-నాణ్యత నియంత్రణ చర్యలు తీసుకున్న నివేదికలపై చర్చ, -నాణ్యత నియంత్రణ తనిఖీ మరియు ప్రతిపాదన మరియు రిపోర్టింగు.
- పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన యం.ఐ.యస్. వెబ్‌సైట్‌పై క్షేత్రస్థాయి సిబ్బంది సలహాలు సూచనలు మొదలగు అంశాలపై చర్చ .
-కొలతల పుస్తకాల (మెజర్‌మెంట్ బుక్ )లో కనిపించే సాధారణ లోటుపాట్లు మరియు ఇతర సాధారణ తప్పిదాలపై చర్చ.
-ఒప్పందం అదనపు సమయం ప్రతిపాదనలు (ఇఓఎటీ).
-తనిఖీ మరియు ఇతర అంశాలపై అవగాహన తదితర అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
డిసెంబర్ నెల 1వ తారీఖున గజ్వెల్ లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐఒసి) కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి సాంకేతిక పరిజ్ఞానం అవగాహన సదస్సు‌ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. పంచాయతీ రాజ్ శాఖ మెదక్ రీజియన్ పరిధిలోని మెదక్, సంగారెడ్డి మరియు సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్ మరియు  ఆఫీసులో పని చేసే సాంకేతిక సిబ్బంది తప్పకుండా ఈ వర్క్ షాప్ కు హాజరు కావాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానంలో రోజు రోజుకు జరిగే మార్పులకు అనుగుణంగా సాంకేతిక సిబ్బంది తదితరులు టెక్నాలజీని పెంపొందిచు కోవాలని తెలుపుతూ ఇది మంచి అవకాశం అని వ్యాఖ్యానించారు.