ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

Published: Tuesday August 10, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ఆగస్టు (9) మండల కేంద్రంలో సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఫ్యాన్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు దయ్యాల వినోద్ కుమార్ ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని వెంకటేశం, కట్టంగూర్ మహేష్, ఎల్లంకి నరేష్, శ్రీనివాస్, సూరారం మధు తదితరులు పాల్గొన్నారు.