ట్రెజరీ డిపార్ట్ మెంట్ పై నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నాం : తెలంగాణ ట్రెజరీ గెజిటెడ్ సర్వ

Published: Wednesday November 17, 2021
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : గతంలో ట్రెజరీలలో బిల్స్ పాస్ అయ్యాక బ్యాంకు కు పంపి ఆతర్వాత వ్యక్తిగత అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యేవని, నేడు బిల్స్ పాస్ అయ్యాక ఐఎఫ్ ఎం ఐ ఎస్ పోర్టల్ ద్వారా ఈ కుబేర్ లో అప్ లోడ్ చేయడం తప్ప వ్యక్తిగత అమౌంట్ లలో జమ చేసే భాద్యత ట్రెజరీ చేతుల్లో లేదన్నారు తెలంగాణ ట్రెజరీస్, అకౌంట్స్ గెజిటెడ్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ జి.వెంకట్ రెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం కొన్ని కధనాలు ట్రెజరీస్ మరియు అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి ప్రచురితమైన దరిమిలా అందులో పేర్కొన్నట్టు సాగునీటి, రోడ్లు, భవనాల పనుల బిల్లులు తమ పరిధిలో కి రావని అవి పి ఏ ఓ లో పాస్ అవుతాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలరుషిప్ ల బిల్లులు ఈ కుబేర్ ద్వారానే జిల్లా ట్రెజరీలలో చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగుల పెన్షన్లు, పి ఆర్ సి ల విషయంలో అంతా ఆన్ లైన్ లొనే పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయని, అటువంటప్పుడు అక్రమాలకు ఆస్కారం ఎక్కడుందని అన్నారు. నిరాధారమైన ఆరోపణలతో ట్రెజరీ ఉద్యోగుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయొద్దని, ఉద్యోగుల పక్షాన అందరిని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి.పురుషోత్తమ రెడ్డి, ప్రెసిడెంట్ పి.ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.