ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి *యువత స్వయం ఉపాధిని అలవర్చుకోవాలి* : *బిఆర్ఎస

Published: Friday April 14, 2023


ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు గ్రామల యువకులు స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న  వివిధ షాపుల  ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన  ఆరేంజ్ బకెట్ బిర్యానీ సెంటర్ ను మరియు త్రిశక్తి టెంపుల్ రోడ్ సమీపంలో   శ్రీనివాస డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించి,బస్ స్టాండ్ వద్ద  నూతనంగా ఏర్పాటుచేసిన  మిస్టర్ చాయ్ ను  బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)  ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)  మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో వివిధ వ్యాపార రంగాలలో  రాణించి, యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగాలని వ్యాపార నిర్వాహకులకు  సూచించడం జరిగింది. అనంతరం షాప్ నిర్వాహకులు యాజమాన్యం  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)ని సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బీ ఆర్ ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మడుపు వేణు గోపాల్ రావ్,మాజీ చేర్మెన్ కంబలపల్లి భరత్ కుమార్,   బీ ఆర్ ఎస్ వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,ఎంపీటీసీ అచ్చన్న శ్రీశైలం,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారి యాదయ్య, ఎండి జానీ, బీ ఆర్ ఎస్ వి  మంచాల మండల్ అధ్యక్షులు బొట్టు ప్రవీణ్ నాయక్,  బీ ఆర్ ఎస్ నాయకులు చెరుకూరి రవీందర్,కాసరమోని మహీందర్ యాదవ్,పి మహీందర్,డొంకని గోపాల్,యూత్ నాయకులు సిదాం టిల్లు,శ్రవణ్ ముదిరాజ్,బసవపురం కృష్ణ, గణేష్,బంటీ యూత్ ఫోర్ సభ్యులు,మరియు శ్ర శ్రీనివాస డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు కె.లింగం యాదవ్,ఆరేంజ్ బకెట్ బిర్యానీ,  మిస్టరీ చాయ్ సెంటర్ నిర్వాకులు చెరుకూరి మహీందర్,కావలి వెంకటేష్, వనం నరేష్, రాజు, పసులా శ్రీకాంత్,అజయ్,బి శివ తదితరులు పాల్గొన్నారు.