టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Published: Tuesday December 13, 2022
టిపిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి 
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజా పాలన : టిపిసిసి అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపానని నూతనంగా నియమింప బడ్డ టిపిసిసి  ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిర్విరామంగా కృషి చేయాలని టిపిసిసి అధ్యక్షుడు సూచించారని స్పష్టం చేశారు. టిపిసిసి అధ్యక్షుని ఆదేశానుసారం పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు.