టెక్నాలజీస్ సంస్థ తోడ్పాటు : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday August 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 ఆగస్ట్ ప్రజాపాలన : మోమిన్ పేట అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు "టెంపరేట్ టెక్నాలజీస్ కోల్డ్ స్టోరేజ్ సొల్యూషన్ సంస్థ" తోడ్పాటు అందిస్తుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు బుధవారం అనంతగిరి ఎఫ్ పిసిలో సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో కంపెనీ డైరెక్టర్ లు సభ్యులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులతో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, నిర్వహణపై పవర్ ప్రెజం టేషన్ ఇప్పించి సభ్యులకు అవగాహన కల్పించారు. ఇట్టి కోల్డ్ స్టోరేజ్ కొసం 200 స్క్వేర్ ఫీట్ల స్థలం అవసరమని, దీని ఏర్పాటుకు రూ. 4.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేసినారు. కోల్డ్ స్టోరేజ్ లో మూడు నుండి నాలుగు రోజుల పాటు పండించిన కూరగాయలు, పండ్లను ఎలాంటి నష్టం లేకుండా ఉంచుకొని అమ్ముకోవచన్నారు.  స్టోరేజ్ కు (08) గంటల విద్యుత్ మిగతా సమయంలో బాటరీతో నడుస్తుందని, విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలియజేసినారు. కోల్డ్ స్టోరేజ్ వల్ల కంపెనీ రైతుల నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులు పడవకుండా మరియు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా స్టోర్ చేసుకొని అమ్ముకోవడం కుదురుతుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పరిసరంలో ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ స్థలాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ కృష్ణన్, జిల్లా హార్టికల్చర్ అధికారి చక్రపాణి, ఎంపీడీఓ శైలజ రెడ్డి, డీపీఎం శ్రీనివాస్, మండల హార్టికల్చర్ అధికారి అబ్దుల్ తో పాటు కోల్డ్ స్టోరేజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
:పాఠశాలల సందర్శన:-
  అనంతరం జిల్లా కలెక్టర్ మోమిన్ పేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఈనెల 30 వరకు అన్ని విద్యా సంస్థలలో పారిశుధ్యం, విద్యుత్, నీటి సదుపాయాలతో పాటు పిచ్చి మొక్కలు తొలగించడం, వంట గదులు, మరుగుదొడ్లు శుభరాపరిచి, శానిటైజ్ చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలన్నీ ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎం ఇ ఓ లను ఆదేశించారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో క్లాస్ రూమ్స్, వంట గది, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు.  వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ చేసి పరిశుభ్రం చేయాలని, తలుపులు, కిటికీలు, గేట్ అమర్చాలన్నారు. వాటర్ లీకేజీ  పనులు చేపట్టి అవసరం మేరకు ట్యాప్ లను అమర్చాలన్నారు.  చేపట్టిన పనులు  ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి తనకు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవాడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరు పరస్పర సహకారంతో పనులు పూర్తి చేసి మన విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండ చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాబు మొజెస్, ఎంపీడీఓ శైలజ రెడ్డి, ఎంఇఓ గోపాల్, విద్యుత్ శాఖ ఏఇ సుధాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.