నిశ్చితార్థ వేడుకకు హాజరైన కూచిపూడి, నల్లమోతు..

Published: Monday August 01, 2022
తల్లాడ, జులై 31 (ప్రజాపాలన న్యూస్):
 *తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గోవిందు నరసయ్య కూతురు నిశ్చితార్థ వేడుక ఆదివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు హాజరై కాబోయే వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీసీ సంక్షేమ సంఘం తల్లాడ మండల అధ్యక్షులు గోవిందు శ్రీనివాసరావు,  స్థానికులు కోసూరి నాగార్జున్ రావు, పిన్ని హరీష్ తదితరులు ఉన్నారు.*