గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బందు ప్రకటిచాలి : రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్

Published: Monday July 26, 2021
జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : దళితుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన దళిత బందు లాగ వలస కూలీలను ఆదుకోవడానికి గల్ఫ్ కార్మికుల కోసం కూడా గల్ఫ్ బందు ప్రకటించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రజాపాలన తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం ఇచ్చిన హామీ ప్రకారం 500 కోట్ల కేటాయిస్తూ ఉత్తర్వులు జారి చేయాలన్నారు. రైతు బందు రైతు భీమా, దళిత బందు లాగే గల్ఫ్ బందు ఏర్పాటు చేసి గల్ఫ్ భీమ కూడా గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేపూరి గోపాల్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అమరగొండ తిరుపతి జన్నారం మండల కమిటీ అధ్యక్షులు పరకాల మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దూమల్ల ఎల్లయ్య, ప్రధానకార్యదర్శి సీపతి బాలకృష్ణ అధికార ప్రతినిధి ఎరుకల రమేష్ గౌడ్, మండల నాయకులు ఆరే సత్యం వేముల నగేష్, కామెర శివాజీ బాలసాని రాజకుమార్, సాట్ల తిరుపతి, జాడి విక్రమ్, ఎం డి అజ్మీర్ దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.