వీధి కుక్కలు, కోతుల బెడద నివారించాలని ఎంపీ ఓ కి వినతిపత్రం బోనకల్ సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంల

Published: Saturday November 26, 2022
బోనకల్, నవంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వీధి కుక్కలు బెడద ఎక్కువగా ఉండటంతో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ
గ్రామంలో ఏ వీధికి వెళ్ళిన కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటున్నాయని ,ప్రజలు వీధుల వెంట వెళ్లాలంటే భయపడుతున్నారని, వాహనాలపై వెళ్లే వారి వెంట పడుతున్నాయని, ఇప్పటికే అనేకమంది పిల్లలను, పెద్దలను గాయపరిచాయని వీటికి పిచ్చి ఎక్కక ముందే పట్టించి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలని ,మిగిలిన వాటికి పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్ వేయాలని, అలాగే గ్రామంలో కోతుల బెడద కూడా విపరీతంగా ఉన్నదని ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తున్నాయని ,ఇండ్లలోకి ప్రవేశించి ఇంటిలో వస్తువులు ధ్వంసం చేస్తున్నాయని, వీటిని కూడా సాధ్యమైనంత త్వరగా పట్టించి అడవుల్లోకి వదలాలని శుక్రవారం ఎంపీ ఓ రమణ శాస్త్రికి సిపిఎం బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.ఎంపీ ఓ స్పందిస్తూ బోనకల్ గ్రామంలో కుక్కల ,కోతుల బెడదను సాధ్యమైనంత త్వరలో నివారిస్తామని తెలియజేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం పార్టీ నాయకులు చెన్నా లక్ష్యాద్రి, బిళ్ళా విశ్వనాథం, గద్దె రామారావు, వార్డ్ నెంబర్ ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు.