గొల్లగూడెంలో కళా ప్రదర్శనలు..

Published: Friday March 18, 2022
తల్లాడ, మార్చి 17 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీలో ప్రభుత్వం  అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై కళాకారులు గురువారం అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రాయబారపు అర్జున్ రావు కళా బృందం ఆధ్వర్యంలో ఈ కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును పాటలు ద్వారా వినిపించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో సెక్రెటరీ యాకయ్య, కళాకారులు చాపలమడుగు కోటేశ్వరరావు, పమ్మి రవిబాబు, మునగాల వెంకట రత్నం, అలవాల కృపానందం, కొమ్ము రమేష్, బీరెల్లి రమణ, కొండ్రు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.