రోడ్డుపై పారుతున్న నీటిని ఆపి రోడ్డును మరమత్తు చేయించాలని సిపిఎం డిమాండ్....

Published: Thursday December 02, 2021
ఇబ్రహీంపట్నం నవంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలంలో బండాలేమూర్ గ్రామంలో సాతెల్లి జగన్ ఇంటి నుండి గూదే బిక్షపతి ఇంటి వరకు మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ లీకేజ్ అయ్యి నీళ్లు రోడ్డు పై నిలిచి గుంతలు గుంతలు గా ఏర్పడి మురికి గంటలుగా చెరువులను తలపిస్తు0 నడవలేని స్థితికి చేరుకుంది. రెండు నెలల నుంచి ఈ దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు దీనిని వెంటనే రిపేర్ చేయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బండ లేమూర్ పంచాయతీ కార్యదర్శి కి సిపిఎం పార్టీ తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. రోడ్డుపై నీళ్లు నిలిచి గుంతలు గా ఏర్పడి నడవలేని స్థితిలో ఉంది. బస్తీవాసులు వచ్చేపోయే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున లీకేజీలు బాగుచేసి రోడ్డును మరమతు చేయాలని కోరుతున్నారు. చరిత్రలో కూడా బండా లేముర్ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా బాగుచేయకపోతే జిల్లా కలెక్టర్ ను కలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు పల్లె వీరయ్య, పొచమోని కృష్ణ, మాజి ఎంపీటీసీ వట్టి వెంకటేష్, వార్డు మెంబర్లు జోగు శ్రీనివాస్, జోగు రాజు, మాజి వార్డు సభ్యులు జాపల సుదర్శన్, గ్రామస్థులు వట్టి రాజు, మల్లం జంగయ్య, జాపరిగుడెం సత్తయ్య, కూతురు చంద్రకళ, కొంకాని జంగయ్య, జోగు బుగ్గరాములు, గడ్డం రవి  తదతరులు పాల్గొన్నారు.