ఈ నెల 20న చలో డిల్లీ. ..జంతర్ మంతర్ వద్ద ధర్నా విజయవంతం చేయాలి. ..జిల్లా నాయకులు కే.ఎ.నర్సింహులు

Published: Wednesday October 19, 2022
జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన: 
 
బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అధ్వర్యంలో  ఈ నెల 20న చలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దర్నా తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం జిల్లా నాయకులు కే ఎ నర్సింహులు, కొడూరి చంద్రయ్య లు కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, బీసీలంత ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. బిసి కుల గణన చేపట్టాలని,బిసిలకు మంత్రిత్వ శాఖ ఎర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యాక్రమంలో బీసీ సంఘం మండల నాయకులు  కమ్మల రవింధర్, కాసేట్టి లక్ష్మన్, అల్లం నరేష్, ఐలవేని నర్సయ్య, మైదం గోపాల్, అలం వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area