జోగన్ పల్లి లో అంబరాన్ని అంటిన అంబేడ్కర్ జయంతి సంబురాలు

Published: Saturday April 15, 2023
కోరుట్ల,ఏప్రిల్ 14 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు అంబేడ్కర్ యువజన మాల సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎస్సై చిర్ర సతీష్, కుల నిర్మూలనా పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురం అభినవ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేల్పుల గంగాధర్ లు పాల్గొన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం భవనం నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు అంబేడ్కర్ నినాదాలతో ర్యాలీగా వెళ్ళారు. ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎర్పాటు చేసిన కళాకారులు ధూంధాం గ్రామ ప్రజలను హకట్టుకుంది.కళాకారుల అట,పాటలతో  ప్రజలను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ మాట్లాడుతూ డా.బి ఆర్ అంబేద్కర్ గారు ప్రముఖ భారతీయ న్యాయవాదని, రాజకీయ నేతని,గొప్ప సంఘ సంస్కర్త అని.అంబేడ్కర్  అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి గా ఆయన సేవలు మరువలేనివి అని అన్నారు .అంబేడ్కర్ ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అంబేడ్కర్ ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి,వార్డ్ సభ్యులు,అంబేడ్కర్ యువజన సంఘల నాయకులు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .