ఆయుర్వేద వైద్యం పై పాలకుల నిర్లక్యం

Published: Tuesday October 25, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 23, ప్రజాపాలన : ఆయుర్వేద వైద్యం పై పాలకుల నిర్లక్యంతో ఆయుర్వేద ఆసుపత్రులు నిర్వీర్యం అవుతున్నాయని అడ్వకేట్, ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షుడు  రాజలింగు మోతె అన్నారు.జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
 డాక్టర్లు లేక చాలా చోట్ల ప్రభుత్వ ఆయుర్వేద  ఆసుపత్రులు మూత పడుతున్నాయన్నారు. అందులో డాక్టరు ఫార్మసిస్ట్ లేకపోవడంతో వచ్చే రోగులకు సౌకర్యాలు లేని ఫలితంగా ఆయుర్వేద ఆస్పత్రులు పూర్తిగా మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆయుర్వేద ఆస్పత్రులలో వైద్యులను, సిబ్బందిని  నియమించి ఆయుర్వేద ఆసుపత్రులను  బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు