ఇంజనీరింగ్ విబాగం అధికారులతో ఆభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్

Published: Wednesday September 29, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 28, (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో ఇంజనీరింగ్ విబాగం అధికారులతో జరుగుతున్న ఆభివృద్ది పనులపై  మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ సమీక్ష నిర్వహించినారు. ఈ సంధర్బంగా  పట్టణం లో జరుగుతున్న ఆభివృద్ది పనుల గూర్చి ఆరాతీశారు, పనులలో జరుగుతున్న జోప్యం గూర్చి అధికారులపై మండిపడ్డారు. టెండర్లు అయి కుడా ఇంకా పనూలు ప్రారంబించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న ఆభివృద్ది పనుల వల్ల విజువల్ ఇంపాక్ట్ కనబడేలా ఆభివృద్ది పనులు నిర్వహించాలన్నారు. ప‌ట్ట‌ణ అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వాల‌ని ప‌చ్చ‌ద‌నంతో పాటు వైకుంఠ‌ధామాల నిర్మాణం, టీయూఎఫ్ఐడీసీ నిధుల‌తో చేప‌ట్ట‌నున్న సీసీ రోడ్స్ ల‌పై చ‌ర్చించారు. పెండింగ్ లో ఉన్న ప‌నుల‌తో పాటు నూత‌నంగా చేప‌ట్ట‌నున్న అంశాల‌పై స‌మీక్షించారు. దరూర్ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రీ పార్కు పనులను వెంగవంతం చేయాలన్నారు ఆభివృద్ది పనులలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. ఈ సమీక్ష లో డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈ ఆయుబ్ ఖాన్, వర్క్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.