మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలి.. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి. జగదీష్ జ

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి.సిఐటియు జిల్లా అధ్యక్షులు డి జగదీష్  మాట్లాడుతూ...మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మధ్యాహ్న భోజనం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గత 2 సంవత్సరాల నుంచి గుడ్ల డబ్బులు రావడం లేదు. 6 నెలల నుంచి మెసేజ్ బిల్లులు ఇవ్వడం లేదు. 2వేలు గౌరవ వేతనం పెంచుతూ కెసిఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఆచరణకు నోచుకోవడం లేదు. పెరిగిన ధరలకు మధ్యాహ్న భోజనం కార్మికులు కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో అప్పులు తెచ్చి వంట చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గుడ్ల ధర ఇవ్వడం లేదు. ప్రతినెల బిల్లులు ఇవ్వాలి. పెంచిన 2 వేలు జీతం వెంటనే ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జీలు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కన్వీనర్ సిహెచ్. ఎల్లేష, సిఐటియు నాయకులు గిరి, మధ్యా హన్నా భోజన కార్మికులు కళమ్మ, శిరీష, మైసమ్మ, తదితరులు పాల్గొన్నారు.