అర్పపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం

Published: Thursday March 18, 2021

సారంగాపూర్, మార్చి17 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో అడవిలో వేలసిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర బుధవారం రోజున వైభవంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారుల కథలు కోలాటాలు వివిధ నాట్యాలతో అందరిని మైమారిపించారు. భక్తులు పూలు పసుపు కుంకుమలతో బెల్లం కొబ్బరి కాయలతో మల్లికార్జున స్వామికి మొక్కలు చెల్లించుకుని స్వామిని తరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కొండ శ్రీలత ప్రభాకర్ వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ వివిధ పార్టీల నాయకులు చుట్టూ పక్కల గ్రామ ప్రజలు తరలివచ్చారు.