*వడ్డెర బంధును ప్రకటించి, వెనుకబడిన ప్రతి కుటుంబాన్నికి 10 లక్షలు ఇవ్వాలి*. *వడ్డెర వృత్తిదారు

Published: Tuesday August 30, 2022
వడ్డెర వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. సోమవారం ఇబ్రహీంపట్నం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథి గా చేతివృత్తిదారుల  రాష్ట్ర నాయకులు పైళ్ల.ఆశయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి  పల్లపు.విఘ్నేశ్ మాట్లాడుతూ దేశాన్నికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న కానీ వడ్డెర వృత్తిదారుల బతుకులు ఎక్కడ మారలేదన్నారు. రాష్ట్ర జనాభాలో 30 లక్షలు ఉన్న కానీ అభివృధ్ధికి అమడ దూరంలో ఉన్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, సమాజంలో తమ బతుకులను గడుపుతున్నారు. దళిత బందు మాదిరిగా వడ్డెర బందు ను ప్రకటించాలన్నాలన్నారు. వడ్డెర వృత్తిదారుల డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గట్టలపైన, కార్వీలపైన పూర్తి హాక్కులు వడ్డెరలకే ఇవ్వాలని కోరారు.ప్రభుత్వం  కాట్రాక్టుపనులలో 30 శాతం రిజర్వేజర్లులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజక వర్గం కేంద్రంలో ఒక ఆశ్రమ పాఠశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి వడ్డెర వృత్తిదారులకు 3000 వేల రూపాయాల పీంఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  అనంతరం నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగింది. చేతివృత్తిదారుల సన్వయ కమిటి రాష్ట్ర నాయకులు పైళ్ల.ఆశయ్య గారి ఆధ్యర్వంలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా కుంచం.వెంకటకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గా ఇడగోట్టి. సాయిలు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గా పల్లపు.విఘ్నేశ్, రాష్ట్ర సోషల్  మిడియా కన్వీనర్ గా దేరంగుల. సోషల్ మిడియా కో కన్వనర్ గా వల్లపు.ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు గా గుంజె.బాల్ రాజ్    ఎల్ బి నగర్, కొడదల.శ్రీను, దండుగుల.బాలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఇరుగదిండ్ల.కుర్మయ్య వనపర్తి, గోగుల.రాజు, అలకుంట.యాకయ్య, రాష్ట్ర 24 మంది తో వేయడం జరిగిందని తెలిపారు.