ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి *కొత్తపల్లి గ్రామంలో ఆగ్రో ఫ్రీడ్ కంపెనీ ప

Published: Tuesday February 28, 2023

రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం  నియోజకవర్గం,యాచారం మండలం,కొత్తపల్లి గ్రామ శివార్లు లో వెంకటేశ్వర గుడి ప్రక్కన/రైతుల పంటా పోలాల  మధ్య ల్లో  కిసాన్  ఆగ్రో ఫీడ్స్ అనే కంపెనీ స్థాపించి,దానిలో చట్ట విరుద్ధం గా పశువుల కుళ్ళు మాంసములను తెచ్చి,పశువుల యొక్క వ్యర్ధ పదార్ధాలను నిల్వ ఉంచి వాటి తో  కల్తీ వంట నూనెలను,డాల్డా,నెయ్యి వంటి ఆహారం కూడా కల్తీ చేస్తున్నారు అని అన్నారు ఈ పశువుల వ్యర్ధ పదార్థములను నిలువ ఉంచడం వలన  ప్రజలందరికీ భరించలేని దుర్గంధం వాసనా రావడము వలన చుట్టూ పక్కన గ్రామాలు కొత్తపల్లి తక్కళ్లపల్లి,తమ్మాలోనిగూడ,కిషన్ పల్లి,చింతపట్ల,తండాలు ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు  ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు,రైతులు తమ పంటా పొలాల్లో వారి యొక్క వ్యవసాయం పనులు కూడా చేయలేక పోతున్నారు అని అన్నారు. 26 రోజుల నుండి స్థానిక ప్రజలు వంటవరపుతో చలిని కూడా లెక్క చేయకుండా దీక్షలో పాల్గొంటున్న ప్రజలు న్యాయమైన పోరాటానికి సర్పంచుల సంఘం మద్దతు ఉంటుందని తో కలిసి పోరాటం సిద్ధమవుతామని అన్నారు.ఇలా నీరు,గాలి,భూమి అంత పూర్తిగా కాలుష్యం అవుతుంది కావున ఇకనేనా అధికారులు  స్పందించి కంపెనీని
మూసివేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో...  కొత్తపల్లి గ్రామ సర్పంచ్ హబీబుద్దీన్,  తక్కలపల్లి సర్పంచ్ కంబాలపల్లి సంతోష,ఉపసర్పంచ్ కావాలి జగన్, ఎంపిటిసి కుందవరం సుమతమ్మ లోహిత్ రెడ్డి, వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, పోలె పెద్ద శివ,జంగయ్య, విప్లవ్ కుమార్, పోలె మహేష్,కంబాలపల్లి యాదగిరి,వెంకటేష్, జంగయ్య, రవీందర్ రెడ్డి, రమేష్,కసన్న నాయక్, చందర్ నాయక్,నవీన్ రెడ్డి,రాములు, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, గడల నారయ్య, సత్యనారాయణ,మహేష్,శివశంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.