*విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం**పి డి ఎస్ యు. -అసెంబ్లీ బడ్జెట్ సమావే

Published: Saturday February 04, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 03, (ప్రజాపాలన):-

*విద్యారంగానికి 30%శాతం నిధులు కేటాయించాలని  పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు.
ఈ వారంలో జరుగు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా శుక్రవారం  విద్యారంగా సమస్యల గురించి నిరంతరం పోరాటం చేసే ప్రగతిశిలా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  పీ డీ ఎస్ యు   విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేయడాన్ని పి డి ఎస్ యు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలని. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ & స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ 1500 నుండి 5000 కు పెంచాలని,అన్నారు.

నీళ్లు, నిధులు,నియామకాలు అనే కోణంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం ఆ విద్యారంగాన్నీ పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పరిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ). జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు*. ఈ కార్యక్రమంలో  నాయకులు కోజ్జంకి జైపాల్, బొజ్జి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.