దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాట,ఆద్యుడు, ఆదర్శం. -దేవుని ఎర్రవలిలో కురుమ సంఘము సభ ఏర్పాటు

Published: Friday December 02, 2022

చేవెళ్ల డిసెంబర్ 01 (ప్రజా పాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో గురువరం కురుమ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా తెలంగాణ కురుమ సంఘ పెద్దలు కృష్ణగోని సదానందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
తెలంగాణ రైతాంగ సాయుధ,పోరాటానికి ఆద్యుడు *తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని  కొనియాడారు.
తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.
అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు.


*చేవెళ్ల కురువ కమిటీ అధ్యక్షులు కరికే వెంకటేశం కురుమ మాట్లాడుతూ...*

ఇకముందు కూడా అందరితో కలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో  కురుమ కమిటీ ఏర్పాటు చేయాలి త్వరలోనే చేవెళ్ల గట్టు పైన కురుమ కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తాం, మొదటి సారిగా దేవుని ఎర్రవల్లి కురుమ సభ ఏర్పాటు ప్రణాళిక సిద్ధమయ్యింది ప్రతి గ్రామంలో ఇకనుంచి కమిటీలు వేయడం జరుగుతుంది... ఈ కార్యక్రమంలోని...ఉపాధ్యక్షుడు దండు పాండు, సత్యనారాయణ, ఎర్ర మల్లేష్, సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కుమార్, కోశాధికారి వెంకటేష్, ప్రవీణు, శంకర్, మహేందర్,శ్రీనివాసు, రాఘవేందర్, పాండు, ప్రభాకర్, మల్లేష్, రాములు, సత్యనారాయణ, రవి, చేవెళ్ల కమిటీ సభ్యులు, దేవుని ఎర్రవల్లి కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు...