పండిట్ మరియు పిఇటిలకు ప్రమోషన్లు ఇవ్వాలి టీచర్స్

Published: Saturday February 11, 2023

మధిర ఫిబ్రవరి 10 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మాటూరు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం  విద్యాశాఖలో ప్రస్తుతం చేపడుతున్న ప్రమోషన్లలో లాంగ్వేజ్ పండిట్లు మరియు పీఈటీలకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని మాటూరు ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ వేము రాములు హిందీ పండిట్ పి లక్ష్మి  పిఈటి రమాదేవి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత ప్రమోషన్లలో అవకాశం కల్పించని కారణం చేత ఈ నెల మొదటి తారీకు నుంచి 9,10 తరగతులు బోధించకుండా నిరసన తెలియజేస్తున్నారు.  ప్రతి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు బోధించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా గ్రేడ్ 2 పండితులచే బోధన చేస్తూ వారి శ్రమను దోచుకుంటూ గత 20 సంవత్సరాలుగా అన్యాయానికి గురి చేస్తున్నారు. చాలామంది ప్రమోషన్ లేకుండానే రిటైర్ అవుతూ వస్తున్నారు.తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ  ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలోనే తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.