పాలమూరు గాడిదలు, గొర్రెల చోరీ...! పది రోజుల్లో 60 గొర్రెలు... 15 గాడిదలు మాయం. వెంటపడి పట్టుకున్న బా

Published: Saturday July 02, 2022
పాలేరు జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
మూగజీవాల పచ్చి మేత కోసం పాలమూరు జిల్లా కు చెందిన గొర్రెల పెంపకందారులు మందను తీసుకుని ఈ ప్రాంతం కు వస్తారు. ఇక్కడ వ్యవసాయ పనులు ప్రారంభించేంత వరకు జీవాలను మేపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో నేలకొండపల్లి మండలం లోని నాచేపల్లి, రాయగూడెం. చెరువుమాధారం గ్రామ సమీపంలో పొలాల్లో మందలను ఉంచుతారు. వీరి వెంట బరువులను మోసేందుకు గాడిదలను తీసుకొస్తారు. ఇటీవల కాలంలో గాడిదలు, గొర్రెలు చోరీకి గురవుతున్నాయి. ఒక్క పది రోజుల్లోనే 60 గొర్రెలు, 15 గాడిదలు మాయమైయ్యాయి. పెంపకందారులు కంటికి కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున దొంగల
ముఠా రాయగూడెం వద్ద మంద నుంచి మూడు గాడిదలు, 2 గొర్రెలను ట్రాలీ ఆటో కు ఎక్కించారు. మేల్కోన్న మల్లేష్ అనే బాధితుడు లేచి చూడగా ఆటో'ను
తరలిస్తున్నారు. కేకలు వేయటంతో మిగతా వారంతా మేల్కోన్నారు. లక్ష్మణ్
అనే వ్యక్తి బైక్ వేసుకుని ఆటో ను వెంబడించారు. ఈ క్రమంలో ఆటో తో బైక్
ను డీకొట్టే పని చేశారు. అయినప్పటికీ వెంటపడి రాయగూడెం గ్రామంలో ఆటో
కు అడ్డంగా బైక్ నిలపటంతో దుండుగలు చేసేది లేక ఆటో ను వదిలి పరారైయ్యారు. విషయం ను పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలం కు చేరుకుని గాడిదలను బాధితులకు అప్పగించి, ఆటో ను స్టేషన్ కు తరలించారు. పాలమూరు కు చెందిన హనుమంతరావు కు
చెందిన 16 గొర్రెలు. 4 గాడిదలు, శివకోటి కి చెందిన 2 గాడిదలు, 3 గొర్రెలు,
బీరప్పన్ కు చెందిన 3 గాడిదలు, 2 గొర్రెలు, బాలరాజు కు చెందిన 3
గాడిదలు, 2 గొర్రెలు, చంద్రప్ప కు చెందిన 5 గాడిదలు, 2 గొర్రెలు,
డి. కొండప్పకు చెందిన 3 గాడిదలు, జే.శ్రీను కు చెందిన 2 గాడిదలు. ఇలా
పలువురు కు చెందిన దాదాపు 60 గొర్రెలు. 15 గాడిదలు చోరీ జరిగినట్లు
 
బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని
బాధితులు కోరారు.