పిల్లల చదువుల్లో తల్లిదండ్రులు బాధ్యత కీలకమైనది :సర్పంచ్ యంగల దయా మనీ పేరెంట్-టీచర్స్ సమావే

Published: Monday November 21, 2022
బోనకల్, నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి :పిల్లల చదువుల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లితండ్రుల పాత్ర కీలకమైనదని సర్పంచ్ యంగల దయామణి అన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు మండలంలోని కలకోట ప్రాధమికొన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయలు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఇంటిదగ్గర తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పక అవసరమని,వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని,మంచి చెడులను వారికి వివరించి చెప్పాలని,పాఠశాలలో మంచి బోధన సామర్థ్యం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారని వారికి గ్రామం నుండి సహాయ సహకారాలు అందించాలని, అమ్మ ఒడి తరవాత తరగతి గదే పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దే ముఖ్యమైన ప్రదేశం అని అన్నారు.ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు జ్ఞానీ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం మీటింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాల ప్రగతి నివేదికను తల్లి దండ్రులకు చదివి వినిపించి తొలి మెట్టు కార్యక్రమం అమలుతీరు విద్యార్థుల ప్రగతి, మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు పాఠశాలకు విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్న తీరును వివరించారు.పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం మరువలేనిదని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఎస్ ఏం సి చైర్మన్ రత్నాకర్, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరచారి,శ్రీనివాస్,కోటేశ్వరరావు,సలీం, నాగేశ్వరావు, సురేష్ బాబు, కోటి,సంగీత సునీత వెంకటేశ్వరావు,మురళి,మధ్యాహ్నం భోజన వంట సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.