సమాజ హితంలో, మేము సైతం-కొత్త ఉమా సుదర్శన్ రెడ్డి

Published: Friday March 25, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 24 మార్చి ప్రజాపాలన: సమాజ సేవ లో మేము సైతం అంటూ ముందుకు వచ్చిన కొత్త ఉమా సుదర్శన్ రెడ్డి. భవాని నగర్, ఇసిఐయల్, హైదరాబాద్ నివాసి కొత్త ఉమా సుదర్శన్ రెడ్డి  (కీ. శే. కొత్త సుక్కమ్మ నర్సిరెడ్డి గార్ల కుమారుడు) సమాజ సేవ లో భాగంగా యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఉమా మహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం భారీ విరాళం ను అందజేశారు. గూడూరు గ్రామంలో ని శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం సంబంధిత గ్రామస్తులు అడిగిన వెంటనే పెద్ద మనసుతో కొత్త ఉమా సుదర్శన్ రెడ్డి  రూ.5,01,116/- (ఐదు లక్షల వేయి నూట పదహారు రూపాయలు) విరాళంగా ప్రకటించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొందరు దాతలు గుడి పునర్నిర్మాణం కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కీ.శే పాలెం లిఖిత్ రెడ్డి జ్ఞాపకార్థం (పాలెం మీనా-జయ ప్రకాష్ రెడ్డి గార్ల మనుమడు) వారి తల్లిదండ్రులు పాలెం రాజ్యలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి విరాళంగా రూ. 1,11,116/- (ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు) అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకుడు గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, కాంట్రాక్టర్ బాల్ రెడ్డి గ్రామ పెద్దలు ఆలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యులు. ఆలయ అభివృద్ధి కమిటీ, గూడూరు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలకు అభినందనలు ఆశిస్సులు తెలియజేశారు.