రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కి కుడికాల హర్షిత ఎంపిక

Published: Thursday November 18, 2021
బెల్లంపల్లి నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి : ఈ నెల 11, 12 తేదిల్లో ఆన్ లైన ద్వార నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ మాణక్ లో బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్, విద్యార్థి కుడికాల హర్షిత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అతను తయారు చేసిన వ్యవసాయ ఆటో మిషన్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక అయినందున కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఈరబత్తుల, రవిప్రసాద్, ప్రిన్సిపాల్ ఎం, రాజారమేష్ మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్షిత్ తయారు చేసిన వ్యవసాయ ఆటో మిషన్ ప్రాజెక్ట్ లో 3 స్థాయిలు ఉన్నాయని 1 వ స్థాయిలో ఆటోమాటిక్ గా వాటర్ ప్లాంటే౦ట్ పద్ధతి ఇది మొక్కలకు తగినంత నీటిని ప్రవాహింప చేస్తుందని. నీరు సరిపోయిన వెంటనే దానికదే ఆగిపోతుందని, అలాగే రెండవ స్థాయి లేజర్ ట్రిప్ వైర్ టెక్నాలజీ ద్వారా ఏదైనా జంతువు పొలంలోకి ప్రవేశిస్తే దానిని గుర్తించి మొబైల్ ఫోనే కి వెంటనే సంకేతం ఇస్తుందని, మూడవ  స్థాయిలో ఆటో మెటిక్ సీడ్ విత్తే యంత్రం ఇది స్వతహాగా విత్తనాలను నాటుతుందని ఈ ప్రాజెక్టు సెన్సార్ల సహాయంతో పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టు తో మనం మొక్కలను, పంటలను, నీటి ప్రవాహం నుండి మరియు జంతువుల బారి నుండి రక్షించుకోవచ్చని ఈ ప్రాజెక్టు మొత్తం రైతుకు పూర్తి సహాయకారిగా ఉంటుందని. ఈ ప్రాజెక్టు తో ఉత్పాదకతను పెంచవచ్చని వారు తెలిపారు.