రామంతాపూర్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు

Published: Friday April 29, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పాత రామంతాపూర్లో బొడ్రాయి 6వ వార్షికోత్సవ వేడుకలను బొడ్రాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు, కక్కిరేని చేతన హరీష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ఉత్సవాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు సర్వ బాబు యాదవ్, ఎన్ గోవర్ధన్ రెడ్డి, మురళి గౌడ్, సత్యనారాయణ, బుర్ర రాజేష్, రమేష్, బాలయ్య, లింగం, దయాకర్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జంగయ్య, సుధాకర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, నందకిశోర్ యాదవ్, సిరిశాల విజయ్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.