ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 15ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 16, 2022

మున్సిపల్ ఉద్యోగ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి ఈ సందర్భంగా గోడ పత్రిక విడుదల చేశారు*


తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుభందం) రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయంలో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గోడ పత్రిక ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డి.కిషన్ మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.  పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్మికులకు రూ. 21 వేల వేతనం చెల్లించాలన్నారు, అంతేకాకుండా ఈఎస్ఐ ఇపీఎఫ్ లలో జరుగుతున్న అవకతవకలపై సమగ్రమైన విచారణ  జరపి కార్మికులకు న్యాయం చేయాలన్నారు కార్మికులందరికీ వారాంతపు సెలవులు రక్షణ పరికరాలు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అత్యధికలు దళిత కుటుంబాలకు చెందిన వారేనని అందువల్ల దళిత బంధు పథకం ప్రతి మున్సిపల్ కార్మికునికి వర్తింపజేయాలని అన్నారు.
            ఈ నేపథ్యంలో హనుమకొండలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ మహాసభల్లో  కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రధాన ఎజెండాగా చర్చించనున్నామని అన్నారు.
         ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు మేతరి దాసు సి.నవీన్ కార్మికులు మేతరి నవీన్ చెక్క శివ,  వర్మ , రాజు, జాఫర్,రమేష్, కుమార్, సరిత అండాలు, శోభ, తదితరులు పాల్గొన్నారు,