కృష్ణమూర్తి చారి ఆర్థిక సాయం

Published: Tuesday May 04, 2021
శేరిలింగంపల్లి, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రాపురం అధ్యక్షులు, పటాన్చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులుకే కృష్ణమూర్తి చారి ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి  10,121 రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో జీవనోపాధి కరువై చాలా మంది జీవితాలు గడవడమే కష్టంగా మారాయనీ అటువంటి వారిని తనకు తోచిన విధంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కుటుంబ ఖర్చుల నిమిత్తం ఈ డబ్బును ఇవ్వడం జరిగిందన్నారు. కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున వారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రచారకులు రవీంద్ర చారి కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 10,121 రూపాయలను అందచేశారు.