బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ వికారాబాద్ బ్యూరో 3 నవంబర్ ప్రజా పాల

Published: Friday November 04, 2022
నేటి నుంచి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు..
 
 
పాలేరు నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి
నేడు పోటీలను ప్రారంభించనున్న పాలేరు ఎమ్మేల్యే కందాళ నేలకొండపల్లి
 
కార్తీక మాసం సందర్భంగా ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను నిర్వహించనున్నారు. గురువారం నిర్వహకులు ఏర్పాట్లు ను పూర్తి చేశారు. జాతీయ స్థాయిలో ఎద్దుల జతలు రానునండటంతో నిర్వహాకులు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వహాకులు మాట్లాడుతూ...ఈ నెల 4 నుంచి 7 వరకు | I జాతీయ స్థాయిలో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలల్లో పాల్గోనే రైతులకు ఉచిత భోజన వసతి కూడ కల్పించినట్లు నిర్వహకులు తెలిపారు. శుక్రవారం పాలేరు ఎమ్మేల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
-ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ
 
పోటీలకు సహకరిస్తున్న దాతలకు నిర్వహణ కమిటీ ప్రతినిధులు
 
కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్తీక మాసం సందర్భంగా జాతర లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జాతకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. I