గాంధీ భవన్ సాక్షిగా మంత్రి ఎర్రబెల్లి దిష్టి బొమ్మ దహనం

Published: Monday July 12, 2021
హైదరాబాద్ జులై 10 ప్రజాపాలన: యం.పి.డి.వో. అయిన మహిళా అధికారిని అనుచిత వాఖ్యలు చేసి అవమాన పరిచిన  మంత్రి ఎర్రబెల్లి దిష్టి బొమ్మను శనివారం నాడు నాంపల్లి లోని గాంధీ భవన్ సాక్షిగా దగ్ధం చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి గ్రామ సభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన మహిళను ద్వంద్వ అర్థాలు వచ్చే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళా లోకానికి కించపరిచిన సంగతి విధితమే. అనుచిత వాఖ్యలు చేసి మహిళను అవమాన పరిచిన తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు తెలంగాణ మహిళా కాంగ్రెస్. అంతే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించ కూడదు అనే తలంపుతో తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిష్టి బొమ్మను నాంపల్లి గాంధీభవన్ చౌరస్తాలో నినాదాలు చేస్తూ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సునిత రావు మరియు యాదాద్రి - భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఆలేరు నుండి  రేణుక, ధనలక్ష్మి, వరలక్మీ, మసరత్, సదాలక్ష్మి, మాధవి, సీరాజ్, పద్మ, మంజుల మొదలగు వారు పాల్గొన్నారు.