ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి మన ఊరు మన బడి నిధులు వెంటనే కేటాయించి పనులు ప్

Published: Saturday July 16, 2022
కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కావాలి జగన్*.

గత వారం రోజుల నుండి వరుసగా  విస్తారంగా కురుస్తున్న వర్షాలు సందర్భంలో కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కావాలి జగన్ సందర్శించడం జరిగింది.  ఇది వర్షాకాలం కాబట్టి రేకుల రూమ్లలో వర్షం నీరు అంతా వచ్చి క్లాస్ రూమ్స్ నిండిపోతున్నాయి. క్లాస్ రూమ్స్ కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి.  గోడలు పెచ్చులు లేస్తు,పడిపోయే ప్రమాదం ఉంది కావున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా  వెంటనే మన ఊరు మన బడి నిధులు కేటాయించి పనులు తొందరగా ప్రారంభించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో.వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, మాజీ సర్పంచ్ నాగిళ్ల వెంకటయ్య, జంగయ్య రవీందర్, చిన్ను రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.