పారా క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Published: Monday September 06, 2021

టోక్యో పారా ఒలంపిక్స్లో పథకాలు సాధించిన వారికి జేజేలు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : టోక్యో పారా ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బృందాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) రంగారెడ్డి జిల్లా కమిటీ అభినందిస్తూన్నది. 19 పతకాలను సాధించి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పినారు. పథకాల సాధన కోసం వారు చేసిన ప్రతిభ దేశానికి గర్వకారణం. మన దేశంలో పారా స్పోర్ట్స్ దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ లెక్కచేయకుండా పట్టుదలతో పథకాలను సాధించడం జరిగింది. పారా క్రీడాకారులు ఎదుర్కొంటున్న వివక్షత, అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే దేశం కోసం పథకాలు సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగడం వారిలో ఉన్న ప్రతిభకు నిదర్శనం. పారా క్రీడాకారులకు ఏమాత్రం సౌకర్యాలు కల్పించకపోవడం, శిక్షణ కోసం నిధులు కేటాయించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కనీస మద్దతు లభించకపోవడం కార్పోరేట్ సంస్థలు పారా క్రీడాకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. పారా క్రీడాకారులు ప్రభుత్వం మద్దతు కోసం పోరాడవలసిన దుస్థితి  ఏర్పడింది. పారాఓలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అనేక సంవత్సరాల పాటు  నిషేధానికి గురైంది. పారా ఒలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియాపై అవనితి ఆరోపణవస్తున్నవి. వాటన్నిటినీ సరిదిద్ది క్రీడాకారుల అభివృద్ధి కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం మరియు 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా పారా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. సకలంగులైన క్రీడాకారులకు ఇస్తున్న ప్రాధాన్యతను పారా క్రీడాకారులకు ఇవ్వకపోవడం దురదృష్టకరం. క్రీడాకారులు అందర్నీ సమానంగా చూడవలసిన ప్రభుత్వాలే పారా క్రీడాకారుల పట్ల వివక్ష చూపడం ప్రభుత్వ అసమర్థత ఒక నిదర్శనం. రియో ఒలంపిక్స్ లో సృష్టించిన ప్రభంజనాన్ని టోక్యో ఒలంపిక్స్ వరకు కొనసాగించిన చరిత్ర దేశ  పారా క్రీడాకారులకే చెందింది. సౌకర్యాలు కల్పిస్తే ప్రతిభ ఎవరి సొత్తు కాదని పారా క్రీడాకారులు నిరూపించారు. ఇప్పటికైనా పారా క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, టోక్యో పారా ఒలంపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ ప్రభుత్వం కార్పొరేటు సంస్థలు చేయూతనిచ్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న భుజంగారెడ్డి, జిల్లా కార్యదర్శి జేర్కొని రాజు, కోశాధికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్