కరోనా పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ

Published: Saturday May 15, 2021
మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి, మే14 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ సోకి హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహిస్తూ కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసొలేషన్లో ఉండేవారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయుచున్న హెల్త్ స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తలతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై సర్వే పై మరియు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి అందిస్తున్న మందుల గురించి  అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్ను మేయర్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నందున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది సెంటర్లను ఏర్పాటు చేయనైనది. కోవిడ్ కేర్ సెంటర్ మరియు కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ సెంటర్ (పాత పోలీస్ స్టేషన్ భవనం మేడిపల్లి) వ్యాక్సినేషన్ కేంద్రం1 (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఓల్డ్ పీర్జాదిగూడ) వ్యాక్సినేషన్ కేంద్రం 2 (మేడిపల్లి సబ్ సెంటర్) కరోనా వచ్చి ఇబ్బందులు పడుతున్నవారు బెడ్స్స్, ఆక్సిజన్, ఇంజెక్షన్స్ మొదలగు వాటికొరకు కోవిడ్ హెల్ప్ లైన్ నెం. 9849009963 ను సంప్రదించగలరని మేయర్ తెలియజేశారు. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మేయర్ వెంకట్ రెడ్డి కోరారు.