ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నేరెళ్ల శ్రీధర్ నియామకం, రాష్ట్ర ఆర్గన

Published: Tuesday August 30, 2022

జగిత్యాల, ఆగస్టు 29 (ప్రజాపాలన ప్రతినిధి): హైదరాబాదులో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు.  కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని మెటుపల్లి డివిజన్ పరిధిలో ఆత్మకూరు గ్రామానికి చెందిన న్యాయవాది నేరెళ్ల శ్రీధర్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిర్పూర్ గ్రామానికి చెందిన పెంటపర్తి అశోక్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కే.వినయ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా నేరెళ్ల శ్రీధర్ మాట్లాడుతూ  అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తనని  తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో సంఘం పనిచేస్తుందన్నారు. నేను గత 20 సంవత్సరాల నుండి గ్రామస్థాయి నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా  కష్టపడి సంఘముకి పనిచేసినందున నన్ను గుర్తించి రాష్ట్ర కమిటీలో నాకు అవకాశం కల్పించిన జాతీయ కోఆర్డినేటర్ వరుణ్ కుమార్ కు, జాతీయ ఉపాధ్యక్షులు వెంకట నరసయ్యకు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.విద్యాసాగర్ కు కృతజ్ఞతలు తెలిపారు.