పలు చోట్లా కరోనా వాక్సిన్ - ఆరోగ్య పర్యవేక్షకుడు లంకా కొండయ్య

Published: Tuesday September 07, 2021
మధిర, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు దెందుకూరు పిహెచ్సి పరధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున పలు గ్రామాల్లో కరోనా వాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి మిగిలిన వారికీ కరోనా వాక్సిన్ వేయిస్తున్నట్లు పిహెచ్సి దెందుకూరు సెక్టర్ సూపర్ వైజర్ లంకా కొండయ్య వివరించారు. ఈరోజు తొండల గోపవరం తొర్లపాడు, మహాదేవపురం, రాయపట్నం  ఖమ్మంపాడు, దెందుకూరు, మడుపల్లి, లడక్ బజార్, మధిర sc కాలనీ, అంగన్వాడీ కేంద్రాల నందు కోవీ షీల్డ్ వాక్సిన్ 18+ దాటిన వారికీ మరియు సీనియర్ సిటిజెన్ లకు 1st డోస్ రెండవ డోస్ వేశారు అని వివరాలు తెలియపరిచినారు. ఇంకా మన గ్రామాల్లో కరోనా వాక్సిన్ వేయించుకోని వారు చాలా మంది వున్నారు అని వ్యవసాయకూలీలు ఒక పూట వెసులుబాటు చూసుకో ని కరోనా వాక్సిన్ వేయిoచు కోవాలి అని ఈ రోజు ఖమ్మం పాడు తొండల గోపవరం, తొర్ల పాడు గ్రామాల్లో ఉన్న ముఠా మేస్త్రిలు కలసి వాక్సిన్ కూలీలు అందరికి వేయించాలీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ ప్రజా ప్రతినిధులు తో పాటు ఆరోగ్య సిబ్బంది హెచ్స్ సుబ్బలక్ష్మి హెచ్స్ కాంత లీలా ఎఎన్ఎం లు జయమ్మ లక్ష్మి విజయ భారతి విజయకుమారి విజయలక్ష్మి రాజ్రశ్వరి అరుణ నాగమణి సునీలా హెచ్ఎ గుర్రం శ్రీను ఆశ లు ఐకేపీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది మెప్మా సిబ్బంది జిపి సిబ్బంది పాల్గొన్నారు.