రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతే రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ

Published: Wednesday June 08, 2022
లక్ష్యం*మధిర జూన్ 7 రూరల్ ప్రజాపాలన ప్రతినిధి మంగళవారం నాడు మండలం *మాటూరు* గ్రామం లో రచ్చబండ కార్యక్రమం జరిగింది
ఈ రచ్చబండ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్*  మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా అభివృద్ధి కలగానే ఉందని, ఒక్క కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని . తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా మందుకట్టలు ఇస్తానని  మోసం చేసిన ఘనుడు కెసిఆర్ అని. టిఆర్ఎస్ ప్రభుత్వం వలన  తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు? రాష్ట్రంలో రైతుల కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.వాటికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.వారికి ఎవరు సమాధానం చెప్తారని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తే మాటకు కట్టుబడి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని వివరించారు. వరికి కనీస మద్దతు ధర రూ. 2,500 ఇస్తామని, ముఖ్యమంత్రి రైతుల బాధలను పట్టించుకోవడం లేదని వారన్నారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్​ మోసం చేస్తున్నారని లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. త్యాగాల తెలంగాణలో  కేసీఆర్​ ముఖ్యమంత్రిలా కాకుండా రాజుల వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​ను ఓడిస్తామని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​పై, టీఆర్ఎస్ పాలనపై  ప్రజలు ఆగ్రహంతో. ఉన్నారని ఈసారి వచ్చే ఎలక్షన్లలో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ,  గ్రామ శాఖ అధ్యక్షులు  *ఏకిటల కృష్ణారావు*.మండల ఎస్సి సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు*. మండల యూత్ అధ్యక్షులు  *అద్దంకి రవి కుమార్*. మండల బీసీ సెల్ అధ్యక్షులు *చిలువేరు బుచ్చి రామయ్య* పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు *బిట్రా ఉద్దండయ్య*.  సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు*. మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు*. *కొంగల ప్రసాద్*. *పుట్ట పుల్లారావు  కోలా శంకర్రావు*,  ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు *భాస్కర్ రావు*. *మేడిశెట్టి శ్రీను శెట్టి నాగేశ్వరరావు  వారం వెంకటేశ్వర్లు. వారం శ్రీను ఎక్కిరాల శ్రీనివాసరావు*  గ్రామ పెద్దలు  నాయకులు,తదితరులురచ్చబండకార్యక్రమంలోపాల్గొన్నారు.