రాజ్యంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తోన్న తెరాస ప్రభుత్వం : జెడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు

Published: Friday January 28, 2022
జడ్పిటిసి, ఎంపిటిసి లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్
బోనకల్, జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: బంగారు తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థలను అవమాన పరిచే విధంగా భారత రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగంలోని స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులు, సెస్ రుణాల్లో ఉన్న పనులను తమకు నిధులు మంజూరు చేయకుండా, అభివృద్ధికి ఆమడదూరంగా ఉంచుతూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ, భారత రాజ్యంగా స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవమానపరుస్తుందని సుధీర్ బాబు మండిపడ్డారు.ఎన్నో ఆశలు పెట్టుకొని జెడ్పీటీసీ,ఎంపిటిసి నిధులతో తమ గ్రామాలు అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ విధమైన పోకడలతో వారి ఆశలు అడియాశలుగా మార్చుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జడ్పిటిసి, ఎంపిటిసి, స్థానిక సంస్థలను బలపరిచే విధంగా ప్రభుత్వం నిధులను విడుదల చేసి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఈ తెరాస ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షించారు. లేనియెడల రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కలసి తెరాస ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.