సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందుచేత

Published: Wednesday November 16, 2022
చౌటుప్పల్, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం గ్రామానికి చెందిన నందగిరి సుగుణమ్మ భర్త రాములుకి అనారోగ్య ఉండటం వలన హాస్పిటల్ ఖర్చులు నిమిత్తము మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపార్స్ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 20వేల రూపాయలు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సుర్కంటి నవీన్ కుమార్ రెడ్డి  చెక్కు అందజేశారు డైరెక్టర్  నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు పేదలకు ఆరోగ్యం కోసం అధికంగా నిధులను ఖర్చు చేస్తున్నారు ఆరోగ్య తెలంగాణ తన లక్ష్యంగా పనిచేస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఏనుగు నర్సిరెడ్డి, కానుగు ప్రవీణ్, గుండెబోయిన సతీష్, పెద్దిరెడ్డి గోపాల్ శివ, అంకురి భాను, తదితరులు పాల్గొన్నారు,