అర్హత కలిగిన దళితులు అందరికీ దళిత బంధు వర్తింపజేయాలి మండల వైఎస్ఆర్ టీ పి, బహుజన సమాజ్ పార్టీ

Published: Tuesday October 18, 2022
బోనకల్, అక్టోబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో అర్హత కలిగిన వారందరికీ దళిత బంధు అమలు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం జరిగిన సమావేశంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇరుగు జ్ఞానేశ్ , బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు గంధ వంశీ మాట్లాడుతూ మండలం లో తొలివిడతగా మధిర నియోజకవర్గం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 100 యూనిట్లు తో దళిత బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దళిత బంధు నిరుద్యోగులు, వికలాంగులు, నిజమైన నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. చింతకాని మండలంలో ఎట్లా అయితే పూర్తి దళిత బంధు చేసినారో మధిర నియోజకవర్గంలో మిగిలి ఉన్న 4 మండలాల్లో కూడా అదేవిధంగా పూర్తిచేయాలని, అర్హత పొంది ఉన్నవారికి దళిత బంధు వర్తింపజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మండలం లో ఉన్న 22 గ్రామాలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సరైన లబ్ధిదారులకు ఎంపిక చేసుకొని న్యాయం జరగాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాము. 
 ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఇరుగు జ్ఞానేశ్, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు గంధం వంశీ,ఉపాధ్యక్షుడు అంతోటి శివ పాల్గొన్నారు.
 
 
 
Attachments area