సిపిఎం లో ప్రజల పక్షాన పోరాడిన నాయకురాలు రమణ నివాళులర్పించిన వారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్య

Published: Thursday June 23, 2022

బోనకల్, జూన్ 21 ప్రజాపాలన ప్రతినిధి:మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్ )గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు కోటా కాటయ్య సతీమణి రమణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఆమె భౌతిక కాయానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోట రమణ కుటుంబం మొదటినుంచి వారి మామ కోట లక్ష్మయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చివరిదాకా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేద ప్రజల పక్షాన నిరంతరం పార్టీ పెరుగుదలకు విశేష కృషి చేశారని అన్నారు. వీరి కుటుంబం మొదటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ పార్టీ కోసం పని చేయడం గొప్ప విషయం అని అన్నారు. కోటా కాటయ్య ఇప్పటికీ అతని ఆరోగ్యం సహకరించకపోయినా గోవిందపురం సిపిఎం పార్టీ రెండవ శాఖ కార్యదర్శిగా ప్రజా సమస్యల పరిష్కారానికై తన భార్య అనారోగ్యంతో ఉన్న కానీ పార్టీ ఇచ్చే ప్రతి పిలుపులో కాటయ్య కుటుంబం ముందు ఉండేదని అన్నారు. వీరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, తుళ్లూరు రమేష్ ,నోముల పుల్లయ్య, కొమ్మినేని రవి, పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాదినేని నారాయణ మాజీ సొసైటీ అధ్యక్షులు ఉమ్మినేని కోటయ్య ,మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య ,సొసైటీ డైరెక్టర్ కళ్యాణపు శ్రీనివాసరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కోట రాంబాబు వైయస్సార్ టిపి జిల్లా నాయకులు ఇరుగు జానేస్, టిడిపి జిల్లా నాయకులు వల్లంకొండా వెంకట రామయ్య ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ముత్తరపు గిరి ,గ్రామ సర్పంచ్ ఉమ్మనేని బాబు,మండల నాయకులు కళ్యాణపు నాగేశ్వరరావు ముత్తారం వెంకటి ,కంచర్ల బాబు , వెనిగండ్ల మురళి, లక్ష్మీపురం ఉపసర్పంచ్ గుడ్డురి ఉమా ,గార్లపాడు మాజీ సర్పంచ్ తాత వెంకయ్య ,లక్ష్మీపురం సిపిఎం సెక్రెటరీ గుడ్డిరి వెంకట నరసయ్య, కెవిపిఎస్ మండల నాయకులు ఏసుపోగు బాబు ,గార్లపాటి రమేష్,మంద సత్యానందం తదితరులు పాల్గొన్నారు.