కర్ణ గూడ గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం

Published: Friday October 29, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగేందుకు తెలంగాణ  రాష్ట్రంలో అనేక అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగుడా గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.  కర్ణగూడ  గ్రామ సర్పంచి  కవిత తిరుమల్ రెడ్డి ప్రోద్బలంతో పంచాయతీ భవనానికి నల్ల బోలు పెంటా రెడ్డి అనే  దాత స్టలం ఇవ్వడం గొప్ప విషయం అని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా గ్రామాలను అభివృద్ధి చేసుకొంటున్నామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామాలకు పెద్ద పెద్ద రోడ్లు వస్తున్నాయని. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం గ్రామాలను పచ్చ తోరణాలు మాదిరిగా తయారు అయ్యాయని అన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు తొందరలో మంచి కంపెనీలు వస్తున్నాయని. ఇక్కడ భూములు విరితమైన రేట్లు పేరుగుతాయని అన్నారు. దేశములో ఎక్కడ లేని విదంగా వరిని ధాన్యాన్ని పండించి వాటికి గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వ అని తెలిపారు. వచ్చే యసంగి కి ఆరుతడి పంటలు వేసుకోవాలి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, వైఎస్ ఎంపీపీ మంచి రెడ్డి ప్రతాపరెడ్డి, జడ్పిటిసి మహిపాల్, కర్ణ గూడ సర్పంచి వంగేటి కవిత తిరుమల్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ నల్ల బోలు మమత శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, సర్పంచులు బూడిద రాంరెడ్డి, సామల హంసమ్మ, కంబాలపల్లి గీతా రాంరెడ్డి, చిలుకల యాదగిరి ఉప సర్పంచ్ దామోదర్ రెడ్డి మండల అధ్యక్షుడు చిలక ముగ్గు రాములు విద్యార్థి విభాగం నీట్టు జగదీశ్వర్, అధికారులు ఎంపీడీవో మహేష్ బాబు, ఎంపీవో సురేష్ రెడ్డి, ఏ ఈ ఇంద్రసేనారెడ్డి, చర్ల పటేల్ గూడా, కర్ణంగూడా, గ్రామాలకు చెందిన రైతులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.